Posts

Showing posts from February, 2021

Joe Root • India national cricket team • Virat Kohli • Steve Smith

  చెన్నై : సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా సొంతగడ్డపై మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధమైంది. శుక్రవారం నుంచి చెన్నై చిందంబరం స్టేడియంలో భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ మ్యాచ్ ఇంగ్లండ్‌ సారథి జో రూట్‌కు ఎంతో ప్రత్యేకం. అతడికి ఇది వందో టెస్టు మ్యాచ్. ఈ సందర్భంగా రూట్ మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు పంచుకున్నాడు. జూనియర్‌ స్థాయి క్రికెట్‌ ఆడుతున్నప్పటి నుంచే స్పిన్‌ను చక్కగా ఎదుర్కొనేవాడినని, కచ్చితత్వంతో స్వీప్‌ షాట్‌ ఆడటం అక్కడే నేర్చుకున్నానని చెప్పాడు. బాల్యంలో నేను బక్కపల్చగా ఉండేవాడిని: 'బాల్యంలో నేను బక్కపల్చగా ఉండేవాడిని. దేహదారుఢ్యం పెంచుకొనేందుకు చాలా ఏళ్లు పట్టింది. బంతిలో వేగం ఉండదు కాబట్టి స్పిన్నర్ల బౌలింగ్‌లో ఆడేందుకు నేనో దారి కనుక్కోవాలని అనుకున్నా. స్వీప్‌తో ఎక్కువ బలం సృష్టించొచ్చని తెలుసుకున్నా. కొంతమంది అద్భుత ఆటగాళ్లు, కోచ్‌ల వద్ద ఎన్నో మెలకువలు నేర్చుకున్నా. కేవలం డిఫెండ్‌ చేసేందుకో, ఆధిపత్యం వహించేందుకో ప్రయత్నించను. బంతిని బట్టి ఆడతాను. క్రీజులో కాసేపుంటే ఎక్కువ పరుగులు చేస్తాను. బక్కపల్చగా ఉన్నందుకే స్పిన్ బౌలింగ్‌లో ఆడేందుకు ఈ షాట్ నేర్చుక...